Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Halleluya Yesu Prabhun Ellaru Sthuthiyinchudi

హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

Halleluya Yesu Prabhun Ellaru Sthuthiyinchudi

Verse
హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
Chorus
పల్లవి: రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
Verse
తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి … రాజుల…‖ రాజుల ‖
Verse
సూర్య చంద్రు లారఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడ గండ్లారమీరు కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి … రాజుల…‖ రాజుల ‖
Verse
యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి … రాజుల…‖ రాజుల ‖
Verse
అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి … రాజుల…‖ రాజుల ‖

Related Tags

PraiseWorship