Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Harshame Yentho Harshame Kreesthunu

హర్షమే యెంతో హర్షమే క్రీస్తును

Harshame Yentho Harshame Kreesthunu

Lyricist: మిక్కిలి సమూయేలు
Chorus
హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే యెంతో హర్షమే
హర్షమే తద్భక్తవరులకు నద్భుతంబగు యేసు క్రియలా కర్షమై
హృదయంబు నందలి కలుషముం ధ్వంసింపఁజేయు‖ హర్షమే ‖
Verse
ఆర్యుఁడై భాసిల్లు మన ప్రభు నార్త ధ్వనితో జీవమీయఁగ సూర్యరశ్మి
దొలంగి యిరలై క్షోణియును గంపంబు నొందుట‖ హర్షమే ‖
Verse
మారణముఁ దానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్ దారుణిం
జీవించి మఱలను దామెరుసలేమందుఁ జొచ్చుట‖ హర్షమే ‖
Verse
పొరిపొరిం గాసించు చొక త స్కరుఁడు వధ్యాస్తంభమున న నర్మువ
కోస్వామియన న్బ్రభు కరుణతో మోక్షం బొసంగుట‖ హర్షమే ‖
Verse
ఏలి కనువిడ సాలమోన్భూ పౌలు నా దేవాలయపు తెర జీలిపోవను
రెండుగా జన జాల మాశ్చర్యమునఁ బొందుట‖ హర్షమే ‖
Verse
సిలువపై యేసున్ శపించిన ఖలులకై దేవునిఁ బితాయని పిలిచి వీరింగావు
మంచును బ్రేమతో జీవంబు విడుచుట‖ హర్షమే ‖
Verse
నెయ్యమున విభుఁ డేసునాధుం డి య్యరులకై ప్రాణమీయఁగ
వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు భీతినొందుట‖ హర్షమే ‖
Verse
కీటకముతో సాటి యగునా ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని
దామీట నేనిఁక మేటి జీవకిరీట మొందుట‖ హర్షమే ‖

Related Tags

PraiseResurrectionJesus Christ