Verse
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా‖ హే ప్రభు ‖
Verse
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ‖ 2x ‖
శాంతి స్వరూపా జీవనదీపా‖ 2x ‖
శాంతి సువార్తనిధీ‖ సిల్వధరా ‖
Verse
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా‖ 2x ‖
విఫలులు చేసిన విజ్ఞాపనలకు‖ 2x ‖
సఫలత నీవెగదా‖ సిల్వధరా ‖
Verse
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా‖ 2x ‖
పతితులు దేవుని సుతులని నేర్పిన‖ 2x ‖
హితమతి వీవెగదా‖ సిల్వధరా ‖
Verse
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా‖ 2x ‖
మలమల మాడిన మానవ హృదయము‖ 2x ‖
కలకలలాడె కదా‖ సిల్వధరా ‖
Verse
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత‖ 2x ‖
మానవ మైత్రిని సిల్వ పతాకము‖ 2x ‖
దానము జేసెగదా‖ సిల్వ ధరా ‖
Verse
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా‖ 2x ‖
దేవునితో సఖ్యంబును జగతికి‖ 2x ‖
యీవి నిడితివి గదా‖ సిల్వ ధరా ‖
Verse
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా‖ 2x ‖
దాపున జేరి పాపిని బ్రోచిన‖ 2x ‖
కాపరి వీవెగదా‖ సిల్వ ధరా ‖
Verse
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా‖ 2x ‖
ఖలమయుడగు సాతానుని గర్వము‖ 2x ‖
ఖండనమాయె గదా‖ సిల్వ ధరా ‖
Verse
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా‖ 2x ‖
కలుష ఎడారిలో కలువలు పూయుట‖ 2x ‖
సిలువ విజయము గదా‖ సిల్వ ధరా ‖