Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Heenamaina Brathuku Naadi - Ghora Paapini

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని

Heenamaina Brathuku Naadi - Ghora Paapini

Verse 1
హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని‖ 2x ‖
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు‖ Heenamaina ‖
Verse 2
మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత‖ 2x ‖
కరుణించి నన్ను కష్టాలు బాపు‖ 2x ‖
కరుణామయా క్రీస్తేసువా‖ Heenamaina ‖
Verse 3
తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ‖ 2x ‖
పాపి కొరకు ప్రాణమర్పించిన‖ 2x ‖
త్యాగ శీలివి నీకే స్తోత్రము‖ Heenamaina ‖
Verse 4
నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు
లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు‖ 2x ‖
వెరువను జడియను‖ 2x ‖
నీ కంటి పాపను నను కాచే దైవమా‖ Heenamaina ‖

Related Tags

GracePrayerRepentance