Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Holy Holy Holy Holy Holy Holy Holy Holy

హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ

Holy Holy Holy Holy Holy Holy Holy Holy

Lyricist: Bro Anil Kumar
Chorus
హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ హోలీ
హోలీ హోలీ హోలీ హోలీ హోలీ.... యు ఆర్ హోలీ
హోలీ హోలీ హోలీ హోలీ హోలీ.... యు ఆర్ హోలీ
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
నీ రక్తమిచ్చి ఆ .. ప్రాణమిచ్చి ఆ .. మమ్ములను కొన్నావే
ప్రతి జనములో ఆ .. నీ ప్రజలను ఆ .. నీ యాజక రాజ్యము చేసావే ..
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే...
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
Verse
అన్నిటికి పైనున్నావు అందరిని చూస్తున్నావు అధికారము ఇచ్చే మహాదేవుడవు
ఆకాశ భూముల యందు ఈ సృష్టి సర్వము నందు నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు
నీ రాజ్యము నిలుచును నిరతము నీదేగా సర్వాధికారము
నీవెవరికి ఇత్తువో వారిదే అవును భూ రాజ్యము.. ఓహో .... ఓ
మహోన్నతుడు యేసుని శుద్దులదే ఈ అధికారము .. ఓహో .... ఓ
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
Verse
దృశ్యములు అదృశ్యములు ఆకాశ భూజల జీవులు అన్నియును నీయందే సృజియింపబడెన్
సింహాసన ప్రభుత్వములు ప్రధానులు అధికారములు అందరును నీ శాసనముకు లోబడును
నీ మాటతో యేలేడి ప్రభుడవు నీ ఒకడివే సృష్టికి కర్తవు
పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే.. ఓహో .... ఓహో ....
భూరాజులు నివాసులు తమ మహిమనంత తెచ్చి పూజింతురే .. ఓహో .... ఓహో ....
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
Verse
దావీదు చిగురువు నువ్వు యూదా స్తుతి సింహము నువ్వు దావీదు తాళపు చెవి యజమానుడవు
నువ్వు తలుపును మూశావంటే తెరిచేటి వారే లేరు నువ్వు తెరిచిన తలుపును మూసేవారెవరు...
నీ భుజములపై రాజ్య భారము నీదేగా నిత్య సింహాసనము
భూరాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము.. ఓహో .... ఓహో ....
నిను విశ్వసించు వారికే చెందుతుంది నీ సత్య రాజ్యము .. ఓహో .... ఓహో ....
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
వధియింపబడిన గొర్రెపిల్లా సింహాసనాసీనుడా
Verse
సేరాపులు కెరూబులచే పరిశుద్దుడు పరిశుద్దుడని తరతరములు కొనియాడబడే శుద్ధుడవు
నీ స్తుతిని ప్రచురము చేయ మమ్మును నిర్మించావయ్య మా ఆరాధనకు నీవే యోగ్యుడవు
నీ నామము బహు పూజనీయము ప్రతి నామమునకు పైనామము
ప్రతివాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును .. ఓహో .... ఓహో ....
ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును .. ఓహో .... ఓహో ....
రక్షణ ఘనము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే హే ..
రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా
అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా

Related Tags

PraiseWorshipHoliness