Chorus
హోసన్నా పాడుదాం -యేసు దాసులరా
యెసయ్యా మెస్సయ్యకు – ఉన్నతమందు హోసన్నా‖ 2x ‖
Verse
చిన్న గాడిద పిల్లనెక్కి కన్య సుతుడు వెళ్ళినాడు‖ 2x ‖
నన్ను తనదు వశము చేసి – పన్నుగ నన్నేలును‖ హో ‖
Verse
గరులా ఆదివారమునాడు – గురువు చరణములకరిగి‖ 2x ‖
పరిశుద్ద అత్మనుపొంది – తిరిగి యేసుని పొగడుదాం‖ హో ‖
Verse
బాలుర గీతము లాలకించి – ఎలినమన యేసయ్యను‖ 2x ‖
బాలురతో కూడ మనము కూడి స్తుతి చేయుదాం‖ హో ‖
Verse
పాపమంతయు పోగొట్టి – పాపి చెయ్యి పట్టి ఎత్తి‖ 2x ‖
వీపు మీరగ బ్రోవ నన్ను శాపపు సిలువన్ మోసెను‖ హో ‖
Verse
నాడు బాలురెల్లరు కూడి – పాడిరేసు స్వామికి‖ 2x ‖
నేడు యదె రీతి మనము కూడి నుతి చేయుదాం‖ హో ‖