Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hosannanuchu Sthuthi Paaduchu

హోసన్ననుచూ స్తుతి పాడుచూ

Hosannanuchu Sthuthi Paaduchu

Verse
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం‖ 2x ‖
హోసన్నా… హోసన్నా…‖ 4x ‖
ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం‖ 2x ‖
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం‖ 2x ‖
మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము‖ 2x ‖
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము‖ 2x ‖
ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
చింతలన్ని తీర్చి చెంత నిలుచును‖ 2x ‖
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం‖ 2x ‖

Related Tags

PraiseWorshipHeavenly Hope