Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hrudaya Marpimchedhamu Prabhunaku Sthuthi Prashamsalatho

హృదయ మర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో

Hrudaya Marpimchedhamu Prabhunaku Sthuthi Prashamsalatho

Verse
హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి
Verse
పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్
పాపుల పాపము తొలగించుటకు
నిత్యజీవము నిచ్చెన్
Verse
సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు
నిత్య నిరీక్షణ నిచ్చెన్
Verse
ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే
తిరిగి వెళ్ళకు పాపమునకు
నిలువకు పాపములో
Verse
అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం
కాపాడు మా జీవితముల
ఇదియే మా వినతి

Related Tags

WorshipSurrenderDedication