Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hrudayaalanele Raaraaju Yesuvaa

హృదయాలనేలే రారాజు యేసువా

Hrudayaalanele Raaraaju Yesuvaa

Verse
హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా‖ 2x ‖
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును‖ హృదయాల ‖
Verse
నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా‖ 2x ‖
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా‖ హృదయాల ‖
Verse
నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా‖ 2x ‖
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా‖ హృదయాల ‖

Related Tags

WorshipDevotionalJesus