Chorus
హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
నా హృదయారణ్యములో - నే కృంగిన సమయములో
వినిపించుచున్నదీ కేక నాకు - ఒక కేక నాకు - ఒక కేక నాకు
Verse
నాకు కనుదృష్టి ఉన్నంతవరకూ - చదవలేదు నీ వాక్యము‖ 2x ‖
కనుదృష్టి పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ.....‖ 2x ‖
చదవాలని ఉంది - నీ వాక్యము‖ 2x ‖
Verse
నాకు బలము ఉన్నంతవరకూ - నమ్మలేదు నా యేసుని‖ 2x ‖
బలమంతా పోయాకా.. ఆ. ఆ. ఆ. ఆ.....‖ 2x ‖
వెంబడించాను - నా యేసుని‖ 2x ‖
Verse
నేను రోగినై పడి ఉన్నప్పుడు - పిలువలేదు ఏ మనుషుడు‖ 2x ‖
పిలువగనే నా ప్రభువు.. ఊ. ఊ. ఊ. ఊ....‖ 2x ‖
పిలచెను ప్రభువు - ఈ పాపిని‖ 2x ‖
Verse
నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్‖ 2x ‖
స్వరమంతా పోయాక .. ఆ. ఆ. ఆ. ఆ.....‖ 2x ‖
పాడాలని ఉంది నీ గీతముల్‖ 2x ‖
Verse
కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్‖ 2x ‖
కృంగిపోతిని నా ప్రభువా .. ఆ. ఆ. ఆ. ఆ.....‖ 2x ‖
లేవనెత్తయ్యా – ఈ పాపిని‖ 2x ‖