Chorus
హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు నిలచి సదయుఁ
డగుచుఁ దట్టుచుండు సకల విధములను‖ హృదయ ‖
Verse
పరుని బోలి నిలుచున్నాఁడు పరికించి చూడ నతఁడు పరుఁడు గాఁ
డు రక్షకుండు ప్రాణ స్నేహితుఁడు‖ హృదయ ‖
Verse
కరుణాశీలుం డతఁడు గానఁ గాచి యున్నాఁడు యేసు కరుణ నెఱి
గి గారవింపఁ గరము న్యాయంబు‖ హృదయ ‖
Verse
ఎంత సేపు నిలువఁ బెట్టి యేడ్పింతు రతని నాతఁ డెంతో దయచే
బిలుచుచున్నాఁ డిప్పుడు మిమ్ములను‖ హృదయ ‖
Verse
అతఁడు మిత్రుఁడతఁడు మిత్రుం డఖిల పాపులకు మిర లతని
పిలుపు వింటి రేని యతఁడు ప్రియుఁడగును‖ హృదయ ‖
Verse
జాలిచేతఁ దన హస్తములఁ జాఁపి యున్నాఁడు మిమ్ము నాలిం
గనము సేయఁ గోరి యనిశము కనిపెట్టు‖ హృదయ ‖
Verse
సాటిలేని దయగల వాఁడు సర్వేశు సుతుఁడు తన మాట వినెడు
వారల నెల్ల సూటిగ రక్షించు‖ హృదయ ‖
Verse
చేర్చుకొనుఁడి మీ హృదయమున శ్రీ యేసునాధు నతఁడు చేర్చు
కొనుచు మీ కిచ్చును చిర జీవముఁ గృపను‖ హృదయ ‖
Verse
అతఁడు తప్పక కలుగఁజేయు నఖిల భాగ్యములు మీర లతని
హత్తుకొందు రప్పు డానందముతోడ‖ హృదయ ‖
Verse
బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడఁ గాన బ్రతికి యుండు
కాలముననే ప్రభుని గొలువండి‖ హృదయ ‖