Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Hrudhayam loniki thongi choosi

హృదయం లోనికి తొంగి చూసి

Hrudhayam loniki thongi choosi

Lyricist: Suresh Vanguri
Verse
హృదయం లోనికి తొంగి చూసి
నిను నీవే మరి నిలదీసి
ప్రశ్నించుకో విమర్శించుకో
వాక్యంతో సరిచూసుకో
వినయంతో సరిచేసుకో
మేలేదో తెలిసి చేయలేని వైనం
కడు మోసం నా పాడు హృదయం
చేయరాదని తెలిసి చేస్తూనే ఉన్నా
అయ్యయ్యో నా రోత నైజం
క్షమియించుమా కరుణించుమా
మరణకరపు దేహం మరులు కొలుపు మనసూ
దినదినమూ పోరాటమేగా
కోరలు సాచాయి కోర్కెల సర్పాలు
శోధనతో చెలగాటమేగా
బలమీయవా బ్రతికించవా

Related Tags

PrayerRepentance