Chorus
ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు హెచ్చు పొందు
విధము ఇది నుండి పుచ్చుకొనుట కన్న నెప్పు డిచ్చుటయే కడు ధన్యత
యని హెచ్చరించి చెప్పలేదా యేసు ప్రభు వపొస్తలులకు‖ నిచ్చు ‖
Verse
శక్తికొలఁది దాన మీయుండి సోదరులార భక్తికొలఁది పరుల కీయుఁ
డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు
నిచ్చుట యుక్త మని భావించి మదిలో‖ నిచ్చు ‖
Verse
నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి
ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు
డయ్య ప్రీతి తోడును వారవార‖ నిచ్చు ‖
Verse
ఆలయ కృత్యములు జరిగించు యాజకుఁ డెపుడు నాలయంబువలన
జీవించు ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల
బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి‖ నిచ్చు ‖