Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము

Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu

Verse
ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము‖ 2x ‖
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి‖ 2x ‖
Verse
ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి‖ 2x ‖
హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను
సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను‖ 2x వివాహమన్నది ‖
Verse
ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి‖ 2x ‖
సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం‖ 2x వివాహమన్నది ‖
Verse
భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ‖ 2x ‖
క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి‖ 2x వివాహమన్నది ‖

Related Tags

MarriageWeddingCovenant