Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ide Kada Jeevitham Nee Dare Sada Santhvanam

ఇదే కదా జీవితం నీ దరే సదా సాంత్వనం

Ide Kada Jeevitham Nee Dare Sada Santhvanam

Lyricist: Joshua Shaik
Verse
ఇదే కదా జీవితం – నీ దరే సదా సాంత్వనం
ఎడారిలో ఆశ్రయం – నీ నిరీక్షణే నా బలం
ఏ కాలమైనా – కారు మేఘమైనా
ఏ లోయలైనా – శోక సంద్రమైనా
నీవేగా ఆధారం – నీవే కదా మార్గం
Verse
మరువలేని – గాయమైన
నీవే దేవా ప్రేమ చూపి చేరదీసావుగా
విసిగివున్న – జీవితాన
ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా
తలపులన్నీ భారమైన – కలచివేసే ఓటమైన
కొలిచినావుగా నీవు – ప్రతి బాష్పబిందువు నాలో
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
Verse
కపటమైన లోకమందు
నాలో నీవై నీలో నేనై దీపమైనావుగా
మధురమైన మమత చూపి
తోడు నీడై కాచే దేవా స్నేహమైనావుగా
కొరతలన్నీ కూడుకున్నా – కలతలన్నీ ఏకమైన
తలచినావుగా నన్ను – స్థితి మార్చినావుగా నీవు
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా

Related Tags

ComfortHopeStrength