Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idenaa Nyaayamidiyenaa

ఇదేనా న్యాయమిదియేనా

Idenaa Nyaayamidiyenaa

Verse
ఇదేనా న్యాయమిదియేనా
కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ‖ ఇదేనా ‖
Verse
కుంటి వారికి కాళ్ళ నొసగే
గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే
రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర‖ ఇదేనా ‖
Verse
చెడుగు యూదులు చెరను బట్టి
కొరడా దెబ్బలు కసిగా గొట్టి
వీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్‖ ఇదేనా ‖
Verse
మోయలేని సిలువ మోపి
గాయములను ఎన్నో చేసి
నడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో‖ ఇదేనా ‖
Verse
ప్రాణముండగానే సిలువ కొయ్యకు
మేకులెన్నో కొట్టిరయ్యో
ప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో‖ ఇదేనా ‖
Verse
ఎన్ని బాధలు పెట్టిన గాని
మారు పల్కడు యేసు ప్రభువు
ఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి‖ ఇదేనా ‖
Verse
ఎన్ని మారులు పాపము చేసి
యేసుని గాయముల్ రేపెదవేల
నరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల‖ ఇదేనా ‖

Related Tags

Good FridayPassionCrucifixion