Verse
ఇదే నా హృదయ వాంఛన
నీవే నా హృదయ స్పందన‖ 2x ‖
నిన్ను చూడాలని – నిన్ను చేరాలని‖ 2x ‖
నా బ్రతుకు నీలో నే సాగని‖ ఇదే నా ‖
Verse
నీ యందు నిలిచి ఫలియించాలని
నీ అడుగు జాడలోనే నడవాలని‖ 2x ‖
ఈ లోక ఆశలన్ని విడవాలని‖ 2x ‖
నీ సువార్తను ఇలలో చాటాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని –‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా‖ 2x ఇదే నా ‖
Verse
ప్రతి వారు నీవైపు తిరగాలని
ప్రతి వారి మోకాలు వంగాలని‖ 2x ‖
ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని‖ 2x ‖
ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని –‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా‖ 2x ఇదే నా ‖
Verse
ప్రతి చోట నీ పాట పాడాలని
ప్రతి చోట నీ సువార్త చేరాలని‖ 2x ‖
ప్రతి వారికి రక్షణ కావాలని‖ 2x ‖
ప్రతి వారు నీ సన్నిధి చేరాలని
ఆశతో నీ కొరకై నే వేచియుంటిని –‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా‖ 2x ఇదే నా ‖