Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idhigo Deva Naa Jeevitham Aapaada Masthakam Neekankitham

ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకంకితం

Idhigo Deva Naa Jeevitham Aapaada Masthakam Neekankitham

Chorus
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
శరణం నీ చరణం - శరణం నీ చరణం‖ 2x ‖
Verse
పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి‖ 2x ‖
అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
Verse
నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్దించి పనిచేయ నేర్పు‖ 2x ‖
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
Verse
విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు‖ 2x ‖
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా

Related Tags

DevotionalSurrenderDedication