Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idhigo Naa Shishyulaaraa Yeruka Luncha

ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచ

Idhigo Naa Shishyulaaraa Yeruka Luncha

Lyricist: Purushothamu Choudari
Verse
ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి మోక్ష సదనమున కేను
బోదు సంతోషించుఁడి‖ ఇదిగో ‖
Verse
యెరూషలేమందుండి మీ రెదురు చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు
దిగివచ్చి పనులు దెల్పును‖ ఇదిగో ‖
Verse
దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండఁ
బరిశు ద్ధాత్మను బంపెదను‖ ఇదిగో ‖
Verse
నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య
సామ్రాజ్యము నేల‖ నిదిగో ‖
Verse
ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుఁడి నాదు సకలాజ్ఞలందు
నిదియె సార మనుకొనుఁడి‖ యిదిగో ‖
Verse
ఏదైననా పేరిటమీ రించుక వేఁడినను మీకు మోదముతోడదాని
ముందే చేయుదును‖ ఇదిగో ‖
Verse
ఉల్లము లందుఁ గలఁత లెల్ల విడువుఁడి నేను మళ్లి వచ్చెడి విధము
మరువకుండుఁడి‖ యిదిగో ‖

Related Tags

Second ComingPromiseDiscipleship