Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idhigo Nee Raaju Vachchuchunde Seeyona

ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోన

Idhigo Nee Raaju Vachchuchunde Seeyona

Chorus
ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి
సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు‖ ఇదిగో ‖
Verse
నీదురాజు నీతితో దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు వచ్చు చుండె‖ ఇదిగో ‖
Verse
రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె‖ ఇదిగో ‖
Verse
స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై వచ్చుచుండె‖ ఇదిగో ‖
Verse
దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె‖ ఇదిగో ‖
Verse
ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు వచ్చుచుండె‖ ఇదిగో ‖
Verse
దావీదు కుమారుడు దేవుడు పాపులకు
జయగీతములతో వచ్చుచుండె‖ ఇదిగో ‖
Verse
యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము
యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె‖ ఇదిగో ‖

Related Tags

WorshipJesus ChristPalm Sunday