Chorus
ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను
నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె‖ ఇదిగో ‖
Verse
ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ
రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి‖ ఇదిగో ‖
Verse
నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము
దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె‖ ఇదిగో ‖
Verse
కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి
గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె‖ ఇదిగో ‖
Verse
మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము
లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె‖ ఇదిగో ‖
Verse
జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున
నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము‖ ఇదిగో ‖