Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idhigo Nenu Vachuchunnaanu Thvaragaa Vachuchunnaanu

ఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను

Idhigo Nenu Vachuchunnaanu Thvaragaa Vachuchunnaanu

Verse
ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను
ఎవని క్రియల ఫలితము - వానికియ్య వచ్చుచున్నాను
Verse
మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను
ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి
Verse
నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును
అపహరింప కుండునట్లు - జాగ్రత్తగా చూచుకో
Verse
యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు
క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు
Verse
వేవేగరా మా ప్రభు యేసు - వేచియున్నాను నీ కొరకే
నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము

Related Tags

Second ComingRevelationJesus Return