Chorus
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను‖ 2x ‖
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా‖ 2x ‖
మరనాతా... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను.. ఊ ఉ ఉ
Verse
మహా మహా ఆర్భాటముతో - ప్రధాన దూత శబ్దముతో
దేవుని బూరతో - ప్రభువు వేగమే దిగి వచ్చును‖ 2x ‖
ప్రభు నందు మృతులు లేతురు - సమాధులు తెరువగా
విస్వాసులంతా దాల్తురు - మహిమ రూపును వింతగా
ఎత్తబడును సంఘము - అయ్యో ! విడువబడుట ఘోరము ...
Chorus
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా‖ 2x ‖
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను
Verse
ఏడేండ్లు భువిపై శ్రమ కాలం - ప్రాణాలు జారే భయ కాలం
బూరలు తెగుళ్ళు - దైవ ఉగ్రతా పాత్రలు‖ 2x ‖
ఆకాశ శక్తుల్ కదులును -గతి తప్పును ప్రకృతి
కల్లోలమౌను లోకము - రాజ్య మేలును వికృతి
సంఘమెంతో హాయి రా - మధ్యాకాశాన విందు రా
Chorus
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా‖ 2x ‖
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను
Verse
అన్యాయం చేయువాడు చేయునిమ్ము - అపవిత్రుడట్లే యుండనిమ్ము
పరిశుద్ధుడింకను - పరిశుద్దుని గుండనిమ్ము‖ 2x ‖
ప్రతివాని క్రియల జీతము - ప్రభు తెచ్చును ఒక దినం
రహస్య క్రియలు అన్నియు - బయల్పడునులే ఆ దినం
లోక ధనము కూడిరా - నీకుంద పై సంపదా
Chorus
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా‖ 2x ‖
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను
Verse
ఒలీవ కొండపై రారాజు - అడుగు పెట్టెడి ఆ రోజు
కొండయే చీలును - భూగోళమే కంపించును‖ 2x ‖
ప్రతి జనము ప్రభుని చూచును - ప్రతి జాతీయు మ్రొక్కును
నిజమైన ప్రభువు యేసని - ప్రతి నాలుక ఒప్పును
ప్రభుని రెండవ రాకడా - సాతానుకు దడ దడ
Chorus
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా‖ 2x ‖
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను
Verse
వెయ్యేండ్లు భువి పై ప్రభు యేసు - పాలించును పరిపాలించును
నీతి సమాధానం - ఆత్మ యందలి ఆనందం‖ 2x ‖
ఈ భూమి దాని కృత్యముల్ - సమస్తము కాలిపోవున్
మిక్కటమైన వేడితో - పంచభూతముల్ లయమగున్
కొత్త భూమి ఆకాశం - ఇంక శాశ్వత జీవితం
Chorus
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా‖ 2x ‖
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను
Verse
క్రీస్తేసును విస్వసించువారే -పరిశుద్ధులుగ తీర్చబడ్డవారే
దేవుని మహిమకు - నిత్య జీవమునకు అర్హులు‖ 2x ‖
జీవం మరణం రెండును - నీ ఎదుటనే యున్నవి
ప్రభు యేసే జీవామార్గమని - నీకు తెలుపబడి యున్నది
విశ్వసించు ప్రియుడా - కాదు తక్కెడోపిక్కడా
Chorus
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా‖ 2x ‖
మరనాతా...... అ
ఇదిగో వినుమా ఓ లోకమా - త్వరలో ప్రభువు రానుండెను‖ 2x ‖
సిద్ధపడుమా ఓ లోకమా - సిద్ధపడుమా ఓ సంఘమా‖ 2x మరనాతా...... అ ‖