Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idi Ascharyame

ఇది ఆశ్చర్యమే

Idi Ascharyame

Lyricist: Philip Gariki
Verse
కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను
తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను
రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను
సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను
ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే
ఆహా ఆనందమే - హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే - ఇది అద్భుతమే
ఆహా ఆనందమే - మెర్రి మెర్రి క్రిస్మస్
Verse
జ్ఞానులు సాగిలపడిరి - మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును
అటువలె విశ్వసించుచు - పూజించెదం ప్రభు యేసును
సర్వోన్నతమైన స్థలములలోన - దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి - భూమి మీద సమాధానము
Verse
గొల్లలు దేవుని మాటను - గ్రహియించిరి దూత చెప్పగా
విధేయతే మనకు ముఖ్యము - గ్రహియించుము దేవుని చిత్తము
వాక్యమైన దేవుడు శరీరధారిగా - మన మధ్యలో నివసించెను
నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము - యేసు క్రీస్తే లోకరక్షకుడు

Related Tags

Christmas