Verse 1
ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా‖ 2x ‖
పైరును చూచెదమా – పంటను కోయుదమా‖ 2x ఇది కోతకు ‖
Verse 2
కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే‖ 2x ‖
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే‖ 2x ఇది కోతకు ‖
Verse 3
సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా‖ 2x ‖
యజమాని నిధులన్ని మీకే కదా‖ 2x ఇది కోతకు ‖
Verse 4
శ్రమలేని ఫలితంబు మీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా‖ 2x ‖
జీవార్ధ ఫలములను భుజియింపవా‖ 2x ఇది కోతకు ‖