Verse
ఇది కోతకు సమయం = పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా
పైరును చూచెదమా = పంటను కోయుదమా
Verse
కోతెంతో విస్తారమాయెనే కోసెడి పనివారు కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే‖ ఇది కోతకు ‖
Verse
సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా
యజమాని నిధులన్ని మీకేగదా‖ ఇది కోతకు ‖
Verse
శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా
జీవార్ధ ఫలములను భుజియింతమా‖ ఇది కోతకు ‖