Chorus
ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు
కొదువలేని దయ గుల్కెడు వానివి‖ యిది ‖
Verse
మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు
నాక్రమింతురు గాక‖ నిది ‖
Verse
అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను‖ ఇది ‖
Verse
ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున‖ నిది ‖
Verse
సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ
బ్రచురముఁ జేయుదు‖ యిది ‖
Verse
దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి
హోసన్నా‖ యిది ‖