Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idigo Deva Naa Jeevitham

ఇదిగో దేవా నా జీవితం

Idigo Deva Naa Jeevitham

Lyricist: Y Babji
Verse
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం‖ 2x ‖
శరణం నీ చరణం‖ 4x ఇదిగో ‖
Verse
పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి‖ 2x ‖
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం‖ ఇదిగో ‖
Verse
నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము‖ 2x ‖
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము‖ ఇదిగో ‖
Verse
విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు‖ 2x ‖
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా‖ ఇదిగో ‖

Related Tags

WorshipSurrenderDedication