Verse
ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకంకితం
శరణం నీ చరణం శరణం నీ చరణం‖ 2x ‖
Verse
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం
Verse
నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము
Verse
విస్తార పంట పొలము నుండి కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు కలకాలం మరినాకు నొసగు
క్షేమక్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
నశియించు ఆత్మలన్ నీదరి చేర్చు కృపనిమ్మయా