Chorus
ఇదిగో మీ దేవుడని - యూదా పట్టణములకు - ప్రకటించుడి
ప్రభువగు మన యేసు తానే - శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును
Chorus
బలముగా ప్రకటించుడి - భయపడక ప్రకటించుడి‖ 2x ‖
Verse
ప్రేమగా మాట్లాడుడి - యెరూషలేముతో
నా జనులను - ఓదార్చుడి
ఆమె దోషరుణము తీర్చబడెనని
రెండింతలు ప్రతిఫలము పొందెనని
Verse
సర్వ శరీరులు - గడ్డివంటివారే
అడవి పువ్వు వంటిదే వారి అందము
గడ్డియెండి దాని పువ్వు వాడిపోవును
మన దేవుని వాక్యము - నిత్యము నిలుచునని
Verse
మన దేవుని మార్గమును సిద్ధపరచుడి
సరాళము చేయుడి రాజమార్గము
మన యేసు మహిమతో బయలుపడును
సర్వ శరీరులు దాని చూచెదరు
Verse
శ్రమననుభవించుడి - మంచి సైనికులై
చిక్కుకొనకుడి - జీవన వ్యాపారములలో
నియమ ప్రకారము - పోరాడుడి
కిరీటము పొంది - యేలుటకై
Verse
దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును
తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో
ప్రీతికరమైన సేవ - చేయుదము
దేవునికే మహిమ - యుగ యుగములకు
Verse
సువార్తను ప్రకటించు ఓ సీయోను
ఉన్నత పర్వతమును ఎక్కుము
సువార్తను ప్రకటించు యెరూషలేమా
నీ యుద్ధకాలము సమాప్తమాయెను
Verse
ఉపదేశించుము సరిగా సత్యవాక్యము
యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా
బహుమానముతో వచ్చును యజమానుడు
అవిధేయత చూపకు దర్శనమునకు