Verse
ఇదిగో నీ రాజు వచ్చుచుండె
సీయోను కుమారి సంతోషించు
యేరూషలేం కుమారి ఉల్లసించు
Verse
నీదు రాజు నీతితో - దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు - వచ్చుచుండె
Verse
రక్షణ గలవాడుగా - అక్షయుండగు యేసుడు
దీక్షతోడ యెరూషలోం - వచ్చుచుండె
Verse
సాత్వీకుండు యీ భువిన్ - అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై - వచ్చుచుండె
Verse
దీనపరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె
Verse
ఇలను గాడిద నెక్కియే - బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె
Verse
దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయ గీతములతో - వచ్చుచుండె
Verse
యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయా