Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idigo Nenoka Noothana Kriyanu

ఇదిగో నేనొక నూతన క్రియను

Idigo Nenoka Noothana Kriyanu

Lyricist: Songs Of Zion
Verse
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను‖ 2x ‖
ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా‖ 2x ఇదిగో ‖
Verse
అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను‖ 2x ‖
ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను‖ 2x ఇదిగో ‖
Verse
నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు‖ 2x ‖
సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను‖ 2x ఇదిగో ‖
Verse
అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు‖ 2x ‖
ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి‖ 2x ఇదిగో ‖
Verse
నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి‖ 2x ‖
ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను‖ 2x ఇదిగో ‖
Verse
నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి‖ 2x ‖
ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్‖ 2x ఇదిగో ‖
Verse
మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి‖ 2x ‖
చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును‖ 2x ఇదిగో ‖
Verse
పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్‖ 2x ‖
కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ‖ 2x ఇదిగో ‖

Related Tags

EncouragementPromiseNew Creation