Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idiye Anukoola Samayamu Neeku Ghana Rakshana Dinamu

ఇదియే అనుకూల సమయము నీకు ఘన రక్షణ దినము

Idiye Anukoola Samayamu Neeku Ghana Rakshana Dinamu

Verse 1
Reference: ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో యిదే రక్షణ దినము 2 కొరింథీ Corinthians 6:2
Verse
పల్లవి: ఇదియే అనుకూల సమయము నీకు - ఘన రక్షణ దినము
Verse
అను పల్లవి: ఆటంకము లేక యేసు నంగీకరించి - చాటెద మెల్లడలన్
Verse
ఆయన రాకడ బహు సమీపమని - వాక్యము వ్రాసియున్నది
వంచకుల దుష్టకార్యములప్పుడు - బహిరంగ పరచబడున్
Verse
మత్తయి యిరువది నాలుగవ అధ్యాయము మార్కు పదమూడును
లూకా యిరువదియొకట వధ్యాయము - చూడ ముగింపు తెలియున్
Verse
యుద్ధములు భువి జరుగుచు నున్నవి - దైవచిత్తము జరుగున్
మరణముల సంఖ్య హెచ్చుచున్నది - నగరులు వణికెడును
Verse
దేవుడు రాగా నాకము మారును - భూమి దహనమగును
నీళ్ళు సముద్రము లింకిపోవు - యేసు తిరిగి రాగన్
Verse
విశ్వాసులందరు నిల్చుట నిజము - దేవుడేసుని వాక్యము
వెలలేని రక్షణ కల్గు సంపాద్యము - సంశయులకు లేదు
Verse
కాలము వ్యర్థము చేయకు ధరలో - కర్మముపట్టుకొనకు
పాపమున్ ప్రేమతో పట్టియుంచకు - శాపము కౌగిలింపకు
Verse
హల్లెలూయా పాడియెల్లరకు తెలుప - నెల్లరతో కూడను
త్వరగా రాబోవు యేసును సంధింప - ఆయత్త పడుము వేగ

Related Tags

GospelSalvationEnd Times