Verse
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి
Verse
పాపులనందరిని – తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా‖ ఇక ‖
Verse
రాజుల రాజైన యేసు రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి‖ ఇక ‖
Verse
బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి‖ ఇక ‖
Verse
వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును‖ ఇక ‖
Verse
సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ‖ ఇక ‖
Verse
జాలము చేయకను – మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ
తరుణముండగానే – మీరు త్వరపడి రారండి‖ ఇక ‖