Verse 1
Reference: ఇదియే రక్షణ దినము 2 కొరింథీ Corinthians 6:2
Chorus
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి రండీ రక్షణ పొందండి
Verse
పాపులనందరిని తన దాపున జేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా
Verse
రాజులకు రాజైన యేసు రానైయున్నాడు
గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి
తరుణముండగానే - మీరు తయ్యారవ్వండి
Verse
బుద్ధిలేని కన్యకలవలె మొద్దులు గానుంటే
సిద్దెలలోని నూనెపోసి సిద్ధపడకపోతె
తలుపును తట్టినను మీకు తెరువడు సుమ్మండి
Verse
వెలుపట నుంటేనూ మీరు వేదన నొందెదరు
ప్రభువా ప్రభువనుచు - యెలుగెత్తి పిలిచినను
మిమ్మును ఎరుగనూ మీ రెవరో పొమ్మనును
Verse
నమ్మిన వారికి క్రీస్తు నెమ్మది నిచ్చునుగా
నమ్మనివారికి నిత్య నరకము తప్పదుగా
నిర్లక్ష్యము చేయకును రండి రక్షణ పొందండి
Verse
సందియపడకండి మీరు సాకులు చెప్పకను
సత్యవాక్యమును మీరు సరిగా చూడండి
మరణ దినమును మన మెరుగము నమ్మండి
Verse
జాలము చేయకను మీరు హేళనచేయకను
కులము స్థలమనుచు మీరు కాలము గడుపకను
తరుణముండగానే మీరు త్వరపడి రారండి