Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idiyenayya Maa Praarthana

ఇదియేనయ్య మా ప్రార్థన

Idiyenayya Maa Praarthana

Lyricist: Kranthi Chepuri
Verse
ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా‖ 2x ‖
Verse
నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
మర్మాలను మాకు నేర్పించయ్యా‖ 2x ‖
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి‖ 2x ఆలకించే దేవా ‖
Verse
నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
లోబడని మా మనసులు సరిచేయయ్యా‖ 2x ‖
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి‖ 2x ఆలకించే దేవా ‖
Verse
నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా‖ 2x ‖
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి‖ 2x ఆలకించే దేవా ‖

Related Tags

WorshipPrayerSupplication