Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Idugo Gorrelakaapari Sodarulaara Ya

ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా య

Idugo Gorrelakaapari Sodarulaara Ya

Lyricist: Purushothamu Choudari
Verse
ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా యిడుగో గొఱ్ఱెలకాపరి కడగానరాని
కారడవిలో నలసట పడెడు గొఱ్ఱెలను పేరిడిబిల్చి రక్షించు నిడుగో‖ నిడుగో ‖
Verse
చెదిరిపోయిన గొఱ్ఱెనై దొడ్డికిఁబోవ ముదములేనివాడనై
మృదుమధురంపు నీ నాదమా లించక కర్త కొదిఁగి యుండక మూఢ
హృదయుఁడనైతి నిడుగో‖ నిడుగో ‖
Verse
దూరంబునకుఁబోతిని జనకుని కృపా సారంబుఁ గొననైతిని కారు
మూర్ఖపుపిల్ల గా సంచరించినా కూరిమి యిలుఁబాసి దారి దొలగిపోతి నిడుగో‖ నిడుగో ‖
Verse
తనదు గొఱ్ఱెను జూచెను బోయఁడు తండ్రి తనశిశువును గాంచెను
కనికరమెదలో నిం డినవారలై నన్ను వన గిరికటకాదు లను వెంబడించిరి ఇడుగో‖ ఇడుగో ‖
Verse
ప్రాణావసర మప్పుడు యేకాకినై క్షీణించియున్నప్పుడు త్రాణార్థమగు
నెనరు త్రాళ్లతో ననుగట్టి నాణెంబుగా(దెచ్చి నన్ను రక్షించెను ఇడుగో‖ ఇడుగో ‖
Verse
చెడుగు మెకములవల్లను బాధలనొంది కడుమలినమై యుండను
కడిగి గాయములన్ని గట్టి శుభ్రముచేసి తడయక నాయింట నిడి
నెమ్మది యొసంగె నిడుగో‖ నిడుగో ‖
Verse
ప్రభుయేసు నా బోయఁడు యీతఁడె భూమి నభము లేలెడి రాయఁ
డు శుభమైన తనదివ్య శోణిత మొసఁగియ వ్విభుఁడు ప్రేమించి దీ
వించి స్వస్థముఁజేసె నిడుగో‖ నిడుగో ‖
Verse
నన్ను దొడ్డిని బెట్టెను పోయినగొఱ్ఱె తెన్ను వెదకిపట్టెను సన్నంపు
పచ్చిక యున్ను జీవనపూట లున్నుఁ గల్గెడిచోట్ల నన్నుంచి రక్షించె నిడుగో‖ నిడుగో ‖
Verse
నేను మూర్ఖపుగొఱ్ఱెనై లోబడకుంటి మానసమున వెర్రినై పూని
యిప్పుడు కాచే వాని శబ్దము ప్రేమ తో నాలింపుచు దొడ్డి
నానందముననుందు నిడుగో‖ నిడుగో ‖
Verse
చెడ్డబిడ్డనై యుంటిని యిటునటుబోవ నెడ్డెతనముఁ గొంటిని
మెడ్డులేకిపుడు ప్రే మింతు నా ప్రియజనకు దొడ్డ శబ్దము వాంఛిం
తును ముక్తి నిలయంబు ఇడుగో‖ ఇడుగో ‖

Related Tags

GraceSalvationShepherd