Verse
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను
మధుర ప్రేమతో మనసులు కలువ
హృదయ సీమలే ఒకటిగ నిలువ
నీ దీవెనలే పంపుమా
Verse
ఆనందముతోడ దు:ఖమునే గెల్వ
చిరునవ్వుతోడ కష్టముల నోర్వ
సంసార నావను సరిగా నడిపించ
నీవే సహాయమీయుమా
Verse
ప్రార్ధనా జీవితము సమాధనము
భక్తి విశ్వాసము నీతి న్యాయము
నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం
అనుగ్రహించి నడిపించుమా
Verse
ఇహలోకభోగముపై మనసుంచక
పరలోక భాగ్యముపై క్ష్యముంచగ
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై
సాగే కృప దయచేయుమా