Chorus
ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని
భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో
మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల‖ నిల ‖
Verse
పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి
బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును
సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ‖ నిల ‖
Verse
మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం
బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె
మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె‖ నిల ‖
Verse
తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన
సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్
బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది‖ నిల ‖