Verse
ఆశీర్వాదంబుల్మామీద - వర్షింపజేయు మీశ
యాశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము
Chorus
ఇమ్మహి మీద గ్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా
Verse
ఓ దేవా పంపింప వయ్యా - నీ దేవెన ధారలన్
మా దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్
Verse
మామీద కురిపించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద - క్షామంబు పోవునట్లుగన్
Verse
ఈనాడే వర్షంపు మీశ - నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి సన్నుతి బ్రార్థింతుము