Verse
ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును
యేసుండు నాకు మారుగా‖ యేసుండు నాకు మారుగా ‖
ఆ సిల్వఁ జాపఁగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు, నాకుఁగా‖ యేసుండు నాకు మారుగా ‖
Verse
ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధుఁ డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు.
Verse
నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొఱ్ఱె పిల్ల? నీ
రక్తంబె చాలును.
Verse
నా నాధు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందుఁ జూచెదన్.
Verse
నా యా యుష్కాల మంతట
నా సంతసం బదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన మిద్దియే.