Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Immanuyeluni Rakthamu Nindina Ootaye

ఇమ్మానుయేలుని రక్తము నిండిన ఊటయే

Immanuyeluni Rakthamu Nindina Ootaye

Verse 1
Reference: రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు హెబ్రీ Hebrews 9:22
Verse
ఇమ్మానుయేలుని రక్తము - నిండిన ఊటయే
ఇమ్ముగ దోషములెల్ల - నివృత్తి చేయును
Chorus
హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్
Verse
పాపాత్ముడైన దొంగయు - ఆ ఊటలోముంగి
మన్నింపు, మోక్షానందము - నొందియానందించెన్
Verse
ఆలాగే నేను యేసుచే - విముక్తి పొందుదు
విలువైన మన్నింపునొంది - పాడుదును సదా
Verse
గాయంపు రక్తమును నే - విశ్వసించి చూచి
ప్రియంపు యేసు ప్రేమను - ప్రకటింతు నెల్లడన్
Verse
మోక్షంబునందు రక్షకున్ - చూచి ప్రహర్షింతున్
రక్షించునట్టి ప్రేమను - రక్తితో పాడుదున్

Related Tags

Blood Of JesusRedemptionSalvation