Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Immuga Nadipinchithivi Nemmadigala Ee Sthalamunaku Prabho

ఇమ్ముగ నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభో

Immuga Nadipinchithivi Nemmadigala Ee Sthalamunaku Prabho

Verse
ఇమ్ముగ నడిపించితివి నెమ్మదిగల ఈ స్థలమునకు ప్రభో
Verse
మా కున్నస్థలము ఇరుకనియు నీకు మొరలిడగా
మరియొకస్థలము మాకొసగితివి నీకృపకై స్తుతులు
Verse
బలపరచి మరిధైర్యము నిచ్చి అభయము నిచ్చితివి
ఇల నీ మందిరమును నిర్మింప జనులను కూర్చితివి
Verse
ప్రభువా నీకై నిర్మింపబడిన నీ మందిర ఘనత
సకల దేశ నివాసులయందు భాసిల్ల గోరితిని
Verse
మీ మధ్యలో నాఆత్మ యున్నదని సెలవిచ్చిన యేసు
ప్రభువా మాకు తోడైయుండి పనిజరిగించితివి
Verse
పుష్కలమై బహుజలమయమైన తావుకు తెచ్చితివి
ఎష్కోలు ద్రాక్షాఫలములుగ ఫలియింప గోరితివి
Verse
అన్యజనులు బహు ఆశ్చర్యపడిరి నీ ఘన కార్యముకై
గుర్తించిరిగా నీ అద్భుతములు దేవా స్తోత్రములు
Verse
వెండి బంగారము లన్నియు నీవి దండిగ నిచ్చెదవు
మెండుగ నీదు మేలుల కొరకై హల్లెలూయ పాడెదము

Related Tags

WorshipThanksgiving