Verse
ఇమ్ముగ నీ హృదయము నిమ్ము - ఇమ్మనెన్ నీ ప్రభు
నావలో నిను యావల జేర్చును నాథుని నామము
Verse
లోక సముద్రము దాటునపుడు - దుఃఖ సంకటములకు జడియకు
నావలో నిను యావల జేర్చును - నాథుని నామము
Verse
లోకమంతా యురులే నీకు - లోకాశలకు లొంగెద వేల
లోక రక్షకుడేసుని మాటకు - లోబడు మిప్పుడే
Verse
పాపమును జేర కూర్చితి నీవు - పాపమును జేయ నేర్చితి నీవు
పావనమగు ప్రభు నామమును - ప్రాపుగా వేడుము
Verse
శాంతి నియ్యని కారెడి తొట్లన్ - వాంఛతో నీవు తొలిపించితివి
పూర్ణశాంతిని ప్రభు నీ కిచ్చున్ - పూజ్యుని వేడుము
Verse
లోకమును నీవు వీడవలయును - లోక మాయలో నిలిచెదవేల
జాగుచేయక జీవముండగనే - జేరుము యేసుని