Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Immuga Nee Sudhinambu Nundi Mimmu Naasheervaadhinchedhanu Pommanina O Maa Prabhuvaa

ఇమ్ముగ నీ సుదినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదను పొమ్మనిన ఓ మా ప్రభువా

Immuga Nee Sudhinambu Nundi Mimmu Naasheervaadhinchedhanu Pommanina O Maa Prabhuvaa

Verse 1
Reference: అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి Haggai 2:19
Chorus
ఇమ్ముగ నీ సుదినంబు నుండి
మిమ్ము నాశీర్వాదించెదను
పొమ్మనిన ఓ మా ప్రభువా
Verse
మునుపటి మందిర మహిమను మించు
కడపటి మంది-ర మహిమ
ఈ స్థలమందు నా సమాధానం
ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా
Verse
అన్యజనులను కదిలింపగానే
అన్ని వస్తువులు తేబడును
వెండి బంగారము అన్నియు నావే
దండిగ నిచ్చెద నంటివి ప్రభువా
Verse
ఇంపుగ తొమ్మిద-వ మాసమున
ఇరువది నాల్గ-వ దినము
నీ మందిర ఆ-స్థి భారమును
నీ వాజ్ఞాపించి వేయించితివి
Verse
నీ ఆజ్ఞలను శిరసావహించి
దివ్యంబుగ నా-బ్రాహాము
హెబ్రోనులో గు-డారంబు వేసి
కట్టెను బలిపీ-ఠము నా చోట
Verse
నిండు మనస్సుతో కాలేబు నిన్ను
దండిగ ననుస-రించగ
హెబ్రోనును తన స్వాస్థ్యంబుగను
సంభ్రముగ నొ-సంగిన దాత
Verse
దావీదు రాజు నీ సన్నిధిలో
దీనతతో మన-వి చేయ
హెబ్రోను పొమ్మని సెలవిచ్చితివి
ప్రభో కలుగు నీకు నీకు నిత్య మహిమ
Verse
ఎల్లల నెల్ల విశాల పరచి
కొల్లగ ప్రేమను జూపి
ఎల్ల శక్తిని జూపిన ప్రభో
హల్లెలూయ నీకే యేసు ప్రభో

Related Tags

WorshipBlessingPromise