Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Inka Nemi Gathi Yunnadhi Maanavulaara

ఇఁక నేమి గతి యున్నది మానవులారా

Inka Nemi Gathi Yunnadhi Maanavulaara

Lyricist: Purushothamu Choudari
Chorus
ఇఁక నేమి గతి యున్నది మానవులారా యిఁక నేమి గతి యున్నది
పాపులకోస మిఁక నేమి గతి యున్నది యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ డుర్వి
లేఁడని ముందె ప్రకటించి దావీదు పల్కె వేదము నందు‖ ఇఁక ‖
Verse
ఇల రక్షకుఁడు లేమిని గొఱ్ఱెల మంద లిలఁ జెల్ల చెదు రాయెను
పులులఁ బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప
జాలరు‖ ఇఁక ‖
Verse
దురితము లణఁగింపఁగఁ బాపుల నెల్ల దరిఁ జేర్చి బ్రతికింపగ పర
మేశ్వరుఁడు తన వరపుత్రుఁ డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణుఁ
జొరకయున్న‖ ఇఁక ‖

Related Tags

RepentanceSalvationHumanity