Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Innaallu Maaku Saayamai Yee Mundhukunu

ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును

Innaallu Maaku Saayamai Yee Mundhukunu

Lyricist: Isaac Watts
Verse
ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా
యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!
Verse
ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో
కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో
Verse
నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు
భయంబు చింతబాధలన్ జయించి మందురు
Verse
చరాచరంబు లెల్లను జనించుకంటె
ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్
Verse
ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన
ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్

Related Tags

WorshipProtectionGodHelp