Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Innaallu Thoduga Maatho Nadichavu

ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు

Innaallu Thoduga Maatho Nadichavu

Verse
ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు
Chorus
ఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము
Verse
ఘనులైన వారే గతియించగా - ధనమున్నవారే మరణించగా
ఎన్నతగనివారమైన మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు
Verse
మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మాదరికి చేరకుండగా
కంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు
Verse
ఈ లోక యాత్రలో సాక్షులుగా
నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా
ఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావు
నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు

Related Tags

WorshipThanksgivingGuidance