Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Innaallu Thodugaa Maatho Nadichaavu

ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు

Innaallu Thodugaa Maatho Nadichaavu

Lyricist: A R Stevenson
Verse
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు‖ 2x ‖
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము‖ 2x ‖
Verse
ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా‖ 2x ‖
ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు‖ 2x ఇశ్రాయేలు ‖
Verse
మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా‖ 2x ‖
కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు‖ 2x ఇశ్రాయేలు ‖

Related Tags

WorshipThanksgivingGuidance