Verse
ఇంతకాలం నీ కృపలో
కాచినావు మా దేవా‖ 2x ‖
తల్లిలాగా తండ్రిలాగా నీ కౌగిలో
దాచినావు‖ 2x ‖
Chorus
మా ప్రాణ ప్రియుడా మా యేసయ్య
స్తుతిపాడెదం మా జీవితమంతా‖ 2x ‖
Verse
కష్టాలలోన నష్టాలలోన
నడిపించినావు చేయివిడువక
శోధనలోన క్రుంగియున్న సమయమున
లేవనెత్తి మమ్ము నిలబెట్టిన దేవ
మా చేతిలో నీ చేయివేసినావు
చక్కనైన త్రోవలో సాగిపోమ్మన్నావు...‖ 2x ‖
నేనున్నానని వాగ్దానమిచ్చావు‖ 2x ‖
Verse
మా స్థితి గతులన్నీ ఎరిగియున్నవాడవు
క్షణమైనా ఏనాడూ యెడ బాయని దేవా
మా రక్షణ కర్తవై మా చెంత నిలిచావు
నీ పిల్లలమైన మమ్ము కాపాడుము దేవా
పిలచిన మరు క్షణమే పలుకరించువాడవే
సజీవుడవైన దేవా ఉన్నవాడవే‖ 2x ‖
మా స్తుతికి పాత్రుడా వందనాలయ్య‖ 2x ‖